
హైదరాబాద్: శాసన సభ సమావేశాల నిర్వహణ కోసం ఉద్దేశించిన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభభవనంలోని స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాస నసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, విప్ బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలు టీ హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏ మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీసీ రిజర్వే షన్ల అంశంపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా కాళేశ్వరంపై షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు. మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టును సభ ముందు ఉంచనున్నారు. ఎరువుల కొరత, వరదల పై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ అంశాలను ఎజెండాలో చేర్చాలని కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
దీంతో రేపు అసెంబ్లీ ముగిసిన తరువాత మరో సారి బీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సభ ఎన్ని రోజులు జరపాలన్న అంశంపై రేపటి(ఆగస్టు 31) సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.