శేరిలింగంపల్లిని ఎంతో డెవలప్​ చేశా :  అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లిని ఎంతో డెవలప్​ చేశా :  అరికెపూడి గాంధీ

చందనాగర్, వెలుగు :  శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని.. మరోసారి తనను ఎన్నికల్లో  గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ కోరారు. శనివారం చందానగర్ డివిజన్ లోని శివాజీనగర్, వీకర్ సెక్షన్, సిటిజన్ కాలనీ, రాజీవ్ నగర్, వెంకటాద్రినగర్, ఇందిరానగర్, హుడా ఫేజ్​–2 కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని జనాలకు వివరించారు.

శేరిలింగంపల్లి సెగ్మెంట్ ను ఎంతో డెవలప్ చేశానని..  ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గాంధీ కోరారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.