ఎల్బీనగర్, వెలుగు: మూసీ నిర్వాసితు లు న్యాయ సహాయం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవద్దని, తెలం గాణ భవన్లో ఏర్పాటు చేసిన లీగల్ టీమ్‌ను ఆశ్రయించాలని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ‘‘కోర్టు ఖర్చుల కోసం పార్టీ ఫండ్ నుంచి కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు” అని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని కొత్త పేట, చైతన్యపురిలో మూసీ ఏరియా ప్రజలతో ఆదివారం సుధీర్‌రెడ్డి సమావేశమయ్యారు. ‘‘మీకు వచ్చిన ఆపద ఏమీ లేదు. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీ ఇండ్లు కూల్చాలంటే ముందు మమ్మల్ని దాటాలి” అని అక్కడి వారితో ఆయన అన్నారు.