బీఆర్ఎస్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యే గంగుల సభను తప్పుదోవ పట్టిస్తున్నారు

బీఆర్ఎస్ ఆదేశాల మేరకే  ఎమ్మెల్యే గంగుల సభను తప్పుదోవ పట్టిస్తున్నారు

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ( ఆగస్టు 31) కొనసాగుతున్నాయి.  ఈ సభలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆ పార్టీ ఆదేశాల ప్రకారమే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. గతంలో ఆయన బీసీ మంత్రిగా పనిచేసినప్పటికి .. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా చట్టసభలో మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకే..  బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.  

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్​ 30 లోగా ఎన్నికల నిర్వహించేందుకు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ కల్పించేందేకు బీసీ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. సభావేదికగా తప్పుడు సమాచారం ఇవ్వవద్దన్నారు.   ఆరు నూరైనా ఇచ్చిన మాటను అమలు చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి చట్టసభలో స్పష్టం చేశారు.