అది ల్యాండ్ లూటింగ్ పాలసీ : హరీశ్ రావు

అది ల్యాండ్ లూటింగ్ పాలసీ : హరీశ్ రావు
  •     5 లక్షల కోట్ల భూమిని 5 వేల కోట్లకే కట్టబెట్టే కుట్ర?: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ఇండస్ట్రీల తరలింపు పేరిట కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కామ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతున్నదని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. అది హైదరాబాద్​ ఇండస్ట్రియల్​ల్యాండ్​ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్​ పాలసీ (హెచ్‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌‌‌‌‌టీపీ) కాదని.. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్​లూటింగ్​పాలసీ అని విమర్శించారు. పారిశ్రామికవాడల్లోని దాదాపు 10 వేల ఎకరాల భూమిని పప్పుబెల్లాల్లా అమ్ముకునే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. 

శనివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో హరీశ్ మాట్లాడారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో సగం భూమిని ప్రభుత్వాలు తీసుకుని, మిగతా సగం భూములకు ఫీజులు పెట్టి రెగ్యులరైజ్​చేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం 30 శాతం ఫీజు తీసుకుని భూములను తెగనమ్ముతున్నారు. 

ఆయన అనుముల రేవంత్​రెడ్డి కాదు.. అమ్మకాల రేవంత్​ రెడ్డి” అని సీఎంపై హరీశ్ మండిపడ్డారు. ‘‘9,292 ఎకరాల భూమిని 30 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా రెగ్యులరైజ్​చేస్తే రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కానీ ఆ భూముల విలువ రూ.5 లక్షల కోట్లు. అంటే మిగతా రూ.4.95 లక్షల కోట్లు స్కామ్​కాదా? అని’’ ప్రశ్నించారు. ఈ పాలసీపై వెంటనే అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్​ చేశారు. 

శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు చెప్పేవి అబద్ధాలు..  

మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు చెప్పేవన్నీ అబద్ధాలని హరీశ్ రావు అన్నారు. ‘‘ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 9,292 ఎకరాల్లో రోడ్లు, మోరీలు పోగా 4,740 ఎకరాలే మిగిలిందంటూ మంత్రి శ్రీధర్​బాబు అబద్ధాలు చెప్పారు. సగానికి సగం భూములను ప్రభుత్వం తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం నిజంగా 4,740 ఎకరాలే అమ్మకానికి పెట్టిందా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని” సవాల్​ విసిరారు.