విజన్ కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్..సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శ

విజన్ కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్..సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శ

బషీర్​బాగ్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిది విజన్ 2047 కాదని.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు దుయ్యబట్టారు. హైదరాబాద్​బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్​తో అస్వస్థతకు గురై కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనల్లో రైజింగ్ అని, హాస్పిటళ్లలో విద్యార్థులు పాలిట మాత్రం ఫాలింగ్ అని ఎద్దేవా చేశారు. 

మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ కోట్లు ఖర్చు చేస్తున్నారని.. పేద పిల్లలకు మాత్రం తిండి పెట్టడం లేదన్నారు. రాహుల్ గాంధీకి ఫుట్ బాల్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ.. చనిపోతున్న రైతులు, విద్యార్థుల మీద లేదన్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులే పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. రేవంత్ సర్కార్ పై ఫిర్యాదు చేసే దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలో సీఎంకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదని విమర్శించారు.