సీఐడీ విచారణ కు కౌశిక్ రెడ్డి

సీఐడీ విచారణ కు కౌశిక్ రెడ్డి
  •     భార్య శాలిని కూడా హాజరు
  •     4 గంటలు ప్రశ్నించిన అధికారులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు: కరీంనగర్  సీపీ గౌస్  ఆలంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30కు తన భార్య శాలినిరెడ్డితో కలిసి లక్డీకపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. డీఎస్పీ రంగస్వామి, మహిళా అధికారితో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆయనను దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించింది. కాగా, సీపీ గౌసం ఆలంపై కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోపాటు సమ్మక్క సారలమ్మల జాతరకు వెళ్లే రోడ్డులో భైఠాయించిన సమయంలో ఆయనతోపాటు భార్య కూడా ఉన్నట్లు తెలిసింది. 

ఈ మేరకు శాలిని రెడ్డికి కూడా సీఐడీ నోటీసులు ఇచ్చి విచారించింది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్  చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు అందించిన సాక్షుల స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది.