కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిళ్లు విసిరేసిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి : రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిళ్లు విసిరేసిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి : రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం

బీఆర్ఎస్ పార్టీ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయారు.. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.. చేతికి ఏది దొరికితే వాటిని విసిరేశారు. టేబుల్ పై ఉన్న వాటర్ బాటిళ్లను కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ పై విసిరేస్తూ రచ్చ చేశారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. కొమరంభీం జిల్లా జన్కపూర్ లో 2025, ఆగస్ట్ 7వ తేదీ ఉదయం.. రేషన్ కార్డు పంపిణీ ప్రోగ్రాం నిర్వహించారు అధికారులు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రవర్తనతో అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొమరంభీం జిల్లా జన్కపూర్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయి కాంగ్రెస్ నేతలు, ప్రజల మీద విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్స్ విసురుతూ రెచ్చిపోయారు కోవా లక్ష్మి. చేతికి ఏది దొరికితే అది విసురుతూ దాడి చేశారు ఎమ్మెల్యే. రేషన్ కార్డుల పంపిణి సందర్భంగా ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వివాదం నెలకొంది.

రేషన్ కార్డుల పంపిణీ గవర్నమెంట్ ప్రోగ్రాం అని.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దని అన్నందుకు కాంగ్రెస్ నాయకులు, అధికారులపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే లక్ష్మి. రాజకీయాలు మాట్లాడద్దని వారిస్తున్నా వినకుండా ఎందుకు మాట్లాడొద్దంటూ తిరిగి కాంగ్రెస్ నాయకులపై దాడికి దిగారు కోవా లక్ష్మి. ఎమ్మెల్యే తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.