ప్రజా ప్రభుత్వం కాదు.. దగా ప్రభుత్వం : ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్

ప్రజా ప్రభుత్వం కాదు.. దగా ప్రభుత్వం : ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ విమర్శ 

హైదరాబాద్​, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు ప్రజా ప్రభుత్వం కాదని, దగా ప్రభుత్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్​లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. రెండేండ్లు అవుతున్నా అమలు చేయడం లేదని విమర్శించారు.

 బుధవారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని మోసం, దగా చేసిందని మండిపడ్డారు. సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సర్పంచ్ ఎన్నికలలో 17.08 శాతం రిజర్వేషన్ కల్పించి అవమానిస్తారా? అని ప్రశ్నించారు. చరిత్రలో ఏ సీఎం చేయని రీతిలో రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.