14న బీసీ గర్జన సభ నిర్వహిస్తం : ఎమ్మెల్యే తలసాని

14న బీసీ గర్జన  సభ నిర్వహిస్తం : ఎమ్మెల్యే తలసాని
  • బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే తలసాని

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ తలపెట్టిన కరీంనగర్ బీసీ గర్జన సభను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారమే సభ నిర్వహించాల్సి ఉన్నా.. దానిని ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో రెండ్రోజుల పాటు కాంగ్రెస్ సర్కారు డ్రామాలు నడిచాయని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. 

అప్పుడేమో హడావుడిగా కులగణన చేసి, ఇప్పుడేమో తొందరపాటుతో ఆర్డినెన్సును తెచ్చిందని మండిపడ్డారు. జంతర్ మంతర్ ధర్నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.