క్వశ్చన్ అవర్లో గంటన్నర స్పీచా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్

క్వశ్చన్ అవర్లో గంటన్నర స్పీచా..  బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్

హైదరాబాద్, వెలుగు: క్వశ్చన్​అవర్​లో సుదీర్ఘ ప్రసంగం చేయడం అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకు లేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. క్వశ్చన్​అవర్​లో సీఎం రేవంత్​ గంటన్నరపాటు మాట్లాడటం అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

ఈ మేరకు శనివారం ఆయన మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్​తో కలిసి తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే.. మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని హరీశ్​ రావు అడిగారని, దీనిపై సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం, ఉద్యమ సమయంలోనూ ఎన్నడూ ఇంతటి అవమానాలు ఎదుర్కోలేదని గంగుల కమలాకర్​ అన్నారు.