మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ రెడ్ కార్పెట్.. లోకల్ లీడర్ల పరేషాన్

మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ రెడ్ కార్పెట్.. లోకల్ లీడర్ల పరేషాన్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట. ఆరు నెలల వరకు పరిస్థితి బాగానే ఉండేదట. ఇప్పుడే సీన్ మొత్తం మారిపోయిందని పార్టీ ఎమ్మేల్యేలు చెప్పుకుంటున్నారట. సీఎంను ఎప్పుడు కలిసినా మహారాష్ట్ర విషయాలే చెప్తున్నారట. లేచినప్పటి నుంచి పడుకునే వరకు మరాఠా విషయాలు తప్ప మరో డిస్కషన్ లేదంట. నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు వెళ్లే...కూర్చోబెట్టి మహారాష్ట్ర ఇష్యూస్ ని చెబుతున్నారట కేసీఆర్. తమ సమస్యలకి పరిష్కారాలు చెప్పకుండా..మహారాష్ట్ర సమస్యలు చెబితే తమకేంటని చర్చించుకుంటున్నారట ఎమ్మెల్యేలు.  

కొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్ర వెంట పడటం దేనికని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యేలు. మన విషయాలు మహారాష్ట్ర వాళ్ళతో చెప్తే ఒకే కానీ.. మహారాష్ట్ర సంగతులు తమకెందుకంటున్నారట ఎమ్మెల్యేలు. చిన్నా పెద్దా ఏ లీడరైన సరే..సీఎం ని కలిస్తే మహారాష్ట్ర సంగతులు వల్లెవేస్తున్నారట.

ప్రగతి భవన్ లో ఈ మధ్య మహారాష్ట్ర వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారట. మనవాళ్లకు లేని ఫ్రీడం..మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు ఉందట. తొమ్మిదేళ్ల నుంచి ప్రగతి భవన్ లో సిచ్యువేషన్ చూస్తున్న నేతలు.. మహారాష్ట్ర నేతలకిస్తున్న విలువ తమకెందుకు ఇవ్వలేదని మాట్లాడుకుంటన్నారట. ప్రగతి భవన్ లోపలికి వెళ్లాలంటేనే సవాలక్ష కండిషన్లు ఉంటాయట. మంత్రులతో సహా ప్రజా ప్రతినిధులందరికీ సేమ్ కండీషన్లట. కానీ మహారాష్ట్ర లీడర్లు ప్రగతి భవన్ కు రావడమే లేటు... గేట్లు ఎత్తేస్తున్నారని చర్చించుకుంటున్నారట ఎమ్మెల్యే లు.

అంతేకాదు ఈ మధ్య సీఎం కేసీఆర్ లోకల్ గా ఏ కార్యక్రమానికి వెళ్లినా మహారాష్ట్ర లీడర్లని తోడుగా తీసుకెళ్తున్నారట. అటు న్యూ సెక్రటేరియట్ లోనూ మహా నేతలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారట.  అటు సీఎం చెప్పే మహారాష్ట్ర సంగతులు వినలేక...ఇటు మహా లీడర్ల హండామా చూడలేక ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారట. ఇవన్నీ చూసిన ఎమ్మెల్యేలు...మహారాష్ట్ర లీడర్లమైనా కాకపోతిమని బాధపడుతున్నారట.