కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.!

కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.!

బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షాకుల మీద షాకులిస్తున్నారు. రోజుకో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆపార్టీని వీడుతున్నారు.  నియోజకర్గ అభివృద్ధి పేరుతో  అధికార కాంగ్రెస్ లోకి వలస బాట పడుతున్నారు. 

ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగులు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్  రెడ్డి కూడా కాంగ్రెస్ లో  చేరుతారని ప్రచారం జరుగుతోంది.  లేటెస్ట్ గా ఇవాళ మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి   సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

Also Read:వన మహోత్సవానికి GHMC రెడీ .. 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

 రెండు రోజుల క్రితం  గ్రేటర్ కు చెందిన  ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. శ్రీధర్ బాబును కలిసిన వారిలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు,  ఉప్పల్ ఎమ్మెల్యే  బండారు లక్ష్మా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మల్కాజ్ గిరి  ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని  విజ్ఞప్తి చేశారు. వీళ్లు కూడా త్వరలోనే పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.