- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలపై దాడేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కేసీఆర్ అంటే ఓ ఎమ్మెల్యే కాదని, ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తెచ్చిన మహా నాయకుడని తెలిపారు. తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్లెవరూ కేసీఆర్ ఆఫీస్ మీద దాడి చేయరని చెప్పారు.
ఈ మేరకు శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తాలిబన్లను మించిపోయారని మండిపడ్డారు. ఈ మధ్య తాలిబన్లు కూడా ఇలాంటి పనులు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతకు సభా నాయకుడి హోదా ఉంటుందని, ఆయన క్యాంపు కార్యాలయంలో ఏ బొమ్మ పెట్టుకోవాలనేది ఆయన ఇష్టమని వెల్లడించారు.
