ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పిడికిలి బిగించి అభివాదం

ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పిడికిలి బిగించి అభివాదం

ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు వెళ్లారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేముందు పార్టీ శ్రేణులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. 

అంతకుముందు.. 

ఇంటి నుంచి ఈడీ ఆఫీసుకు వెళ్లే సమయంలో.. ఎమ్మెల్సీ కవిత వెంట పది వాహనాల్లో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు తరలివెళ్లారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, అడ్వకేట్లు సైతం ఉన్నారు. వాళ్లను ఆఫీస్ గేటు దగ్గరే ఆపేశారు పోలీసులు. కేవలం కవితను మాత్రమే అనుమతించారు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం అంటూ.. భర్త, లాయర్లకు తెలిపారు. కేవలం కవితకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు భద్రతా సిబ్బంది. ఈడీ ఆఫీస్ గేటు దగ్గర అభిమానులకు.. పిడికిలి బిగించి అభివాదం చేశారు కవిత..