నిజామాబాద్ పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించలే : ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి

నిజామాబాద్ పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించలే : ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి
  • బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ పసుపు బోర్డుకు తాజా బడ్జెట్ లో కేంద్రం నయా పైసా కేటాయించలేదని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్ రెడ్డి విమర్శించారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో భీరాలు పలికారని తెలిపారు.

తెలంగాణలో పండే పసుపు విదేశాలకు ఎగుమతి అవుతుందని.. పసుపు ఎగుమతులతో దాదాపు రూ.10 వేల కోట్ల ఎక్స్ పోర్ట్స్ జరుగుతుందని ప్రసంగించారని గుర్తు చేశారు. అలాంటి పసుపు బోర్డుకు ఒక్క రూపాయి కేటాయించకపోవడం శోచనీయమన్నారు. బుధవారం రాజ్య సభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.