లోక్ సభలో మోడీ స్పీచ్ ను బైకాట్ చేసిన బీఆర్ఎస్

లోక్ సభలో మోడీ స్పీచ్ ను బైకాట్ చేసిన  బీఆర్ఎస్

ఢిల్లీ: లోక్ సభలో  ప్రధాని మోడీ ప్రసంగాన్ని బీఆర్ఎస్  బైకాట్ చేసింది.  రాష్ట్రపతి ప్రసంగానికి  ధన్యవాద తీర్మానంపై  చర్చ సందర్భంగా మోడీ ప్రసంగించారు.  ఈ సందర్భంగా మోడీ ప్రసంగాన్ని బైకాట్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.  అదానీ వ్యవహారంపై  జేపీసీ వేయాలని   బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ను పరిగణలోకి తీసుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామానాగేశ్వర్ రావు చెప్పారు.  దీంతో సభ నుంచి వెళ్లిపోయారు.