అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్​ మార్పుపై బీఆర్ఎస్ అభ్యంతరం

అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్​ మార్పుపై బీఆర్ఎస్ అభ్యంతరం
  •  ఓడిపోయిన వ్యక్తి  భార్యకు ప్రోటోకాలా?
  • ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి

హైదరాబాద్​: ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్పీ లీడర్​ కేసీఆర్​కు చిన్న రూమ్ కేటాయించడం కరెక్ట్ కాదని  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతకు  గతంలో నుంచి అదే ఛాంబర్ ఇస్తున్నారన్నారు. దీనిపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం  స్పీకర్ను  కలిశామన్నారు.  ఇప్పటివరకు  కేసీఆర్​వాడుతున్న ఛాంబర్ను  కావాలని  స్పీకర్ అడగడంతో ఇచ్చామన్నారు. కానీ అదే స్థాయిలో ఛాంబర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చిన్న రూమ్ కేటాయించారన్నారు.

కేవలం ఒకే ఒక రూంను కేసీఆర్​కు ఇచ్చారన్నారు. కావాలనే అవమానించడానికే చిన్న రూమ్ ఇచ్చారని ఆరోపించారు.కాంగ్రెస్ కు అయిదుగురు ఉన్నప్పుడు కూడా తాము  రూమ్ ఇచ్చామన్నారు. మరోసారి ఆలోచించి ఛాంబర్ కేటాయించాలని  స్పీకర్ను కోరామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఉన్న చోట్ల ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని  స్పీకర్ కు చెప్పామన్నారు. సంగారెడ్డి లో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి, ఓడిపోయిన ఎమ్మెల్యే భార్యకు ఆర్డీవోతో సహా అధికారులు ప్రోటోకాల్ ఇస్తున్నారని ఆరోపించారు.

ఆర్డీవో మీద ఫిర్యాదు చేశామన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ ఇస్తున్నారన్నారు. దీనిపై డీజీపీ ఆలోచించాలన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, తెల్లా వెంకట్రావు ఉన్నారు.