బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది : గడ్డం వంశీ కృష్ణ

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది : గడ్డం వంశీ కృష్ణ

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. బీఆర్ఎస్ ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక దందా, భూ కబ్జాలు, స్కాములు జరిగాయని ఆరోపించారు. బిజెపి పార్టీ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. బీజేపీ పార్టీ సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

 సింగరేణి సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు రూ. 450 కోట్లు తీసుకువచ్చి సంస్థను కాపాడింది కాక వెంకటస్వామి అని గుర్తు చేశారు. సింగరేణిలో లక్ష మంది ఉద్యోగులను కాపాడిన చరిత్ర కాకదని తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ కుల ప్రారంభానికి వివేక్ వెంకటస్వామి కృషి మరువలేనిదని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే కనుమూస్తానని చెప్పిన కాకా వెంకటస్వామి పలుమార్లు తెలిపారని తొలి ఉద్యమంలో బుల్లెట్ గాయాలకు సైతం బెదరలేదని అన్నారు. 

తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తానని సొంతగా వ్యాపారాన్ని స్థాపించి 500 మందికి ఉద్యోగాలు కల్పించానని తెలిపారు.