- స్పీకర్‌కు ఆరు గ్యారంటీల చట్టబద్ధత బిల్లును అందించిన బీఆర్‌ఎస్
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లును స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు బీఆర్‌ఎస్ పార్టీ అందజేసింది. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు.. స్పీకర్ చాంబర్‌కు వెళ్లి ప్రైవేటు బిల్లును సమర్పించారు.
ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లు నోటీసులు అందజేశారు. ఈ బిల్లు ద్వారా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు వీలవుతుందని చెప్పారు.
