సాయి భగీరథ్‌‌‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలి..మహిళా కమిషన్‌‌‌‌కు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మహిళా నేతల వినతి

సాయి భగీరథ్‌‌‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలి..మహిళా కమిషన్‌‌‌‌కు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మహిళా నేతల వినతి

పద్మారావునగర్, వెలుగు: బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌‌‌‌ను కఠినంగా శిక్షించాలని బీఆర్‌‌‌‌ఎస్ మహిళా నేతలు డిమాండ్​ చేశారు. సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌ సెక్రటరీని కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోక్సో కేసులో నిందితుడైన సాయి భగీరథ్‌‌‌‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చేందుకు  ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

బాధితురాలి కుటుంబానికి అండగా ఉండాల్సిన పోలీసులు, రివర్స్ కేసులతో వారిని భయాందోళనకు గురిచేస్తుండడం అన్యాయమని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.  మహిళా కమిషన్ తక్షణమే కల్పించుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంత పలుకుబడి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితుడికి శిక్షపడాల్సిందేనని అన్నారు. బాధితురాలికి రక్షణ కల్పించడంతోపాటు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.