డ్రగ్స్ కేసు ఆరోపణలపై సీఎం ఆధారాలు చూపించాలి : కేటీఆర్

డ్రగ్స్ కేసు ఆరోపణలపై సీఎం ఆధారాలు చూపించాలి : కేటీఆర్
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్​ ​

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్ ​చేశారు. తనపై ఏమైనా కేసు నమోదు అయిందా? కనీసం అణువంత రుజువైనా ఉన్నదా? అని గురువారం ఓ ప్రకటనలో కేటీఆర్ ప్రశ్నించారు. చిట్​చాట్​ పేరిట తనతో పాటు ఇతరులపైనా సీఎం రేవంత్​ విషం చిమ్మడం ఇది మొదటిసారి కాదని, సీఎం ఆఫీసుకు గౌరవమిచ్చి ఇప్పటిదాకా సంయమనం పాటించానన్నారు. 

సీఎం రేవంత్​కు దమ్ముంటే తనపై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ములేక ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరి రేవంత్ రెడ్డి తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు.