ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్, బీజేపీ బండారం బయటపడింది

ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్, బీజేపీ బండారం బయటపడింది

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వేర్వేరుగా
ఢిల్లీలో ఏం మతలబు జరిగిందో
బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీర్​

హైదరాబాద్:కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధం అని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీర్​ అన్నారు. వారిద్దరి మధ్య ఉన్న ఈ బంధాన్ని బయట పెట్టాలన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్న బీఆర్​ఎస్​పార్టీ,కేసీఆర్​పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై  ఫైర్  అయ్యారు. మంచి ముహూర్తం చూసి శునకాన్ని సీట్లో కూర్చోబెట్టినా బుద్ది మారదు  అంటూ తాను మాట్లాడి అనవసరంగా తన నోరు పాడు చేయదల్చుకొలేదన్నారు.

తాము ప్రభుత్వాన్ని హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే తమపై అంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. ఇంకా బీఆర్ఎస్ వాళ్లే అధికారంలో ఉన్నట్లు అనుకుంటున్నామని  అంటున్నారు.. అసలు తాము అధికారంలో ఉండి..వాళ్లు ప్రతిపక్షం లో ఉన్నట్లు కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయంతోనే బీజేపీ, కాంగ్రెస్ ల బండారం బయట పడిందన్నారు. ఢిల్లీలో ఏం మతలబు జరిగిందో తెలువదన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలువగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వేరు వేరుగా జరుగుతాయని ప్రకటన వచ్చిందన్నారు.

రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ వస్తే బీఆర్​ఎస్​కు  ఒక ఎమ్మెల్సీవచ్చేదన్నారు. కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపుతున్నారని ఆరోపించారు.  సర్పంచుల పదవీకాలం పొడిగించాలని ఆయన డిమాండ్​ చేశారు.  లేకపోతే సర్పంచ్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరారు. కాగా  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై  కేటీఆర్‌ హాట్​ కామెంట్స్ చేశారు. ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారన్నారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును  ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.  

దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్‌ చేస్తే రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. కానీ, నేడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్‌ను ఎలా ఆమోదించారిన ప్రశ్నించారు.