జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరాలి..ఆటో డ్రైవర్ల సంఘం సమావేశంలో కేటీఆర్

జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరాలి..ఆటో డ్రైవర్ల సంఘం సమావేశంలో కేటీఆర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆయన సోమవారం తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఆటోలో ప్రయాణించారు. అక్కడి నుంచి మళ్లీ తెలంగాణ భవన్ కు వచ్చి ఆటో డ్రైవర్ల సంఘంతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చాక 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని.. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ఎత్తి చూపామని.. పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ.5 లక్షల యాక్సిడెంటల్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. మూడు రంగుల జెండా కింద ఆటో అన్నల మూడు చక్రాలు నలిగిపోయాయని అన్నారు.