అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

చేసిన సాయం మరిచి చంపేశాడున్యూయార్క్: నిరాశ్రయుడైన వ్యక్తిపై జాలి చూపించినందుకు అమెరికాలో ఓ ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు.  జార్జియాలో జనవరి 16న చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్ కు చెందిన వివేక్ సైనీ (25) బీటెక్ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ఈ మధ్యనే  బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ సంపాదించాడు. జార్జియాలోని ఓ స్టోర్ లో పార్ట్ టైమ్ పనికి కుదిరాడు. వివేక్ కు ఇటీవల స్టోర్ వద్ద జూలియన్ ఫాల్కనర్ అనే నిరాశ్రయుడు కనిపించాడు. అతడిపై జాలితో రెండ్రోజుల పాటు చిరుతిళ్లు అందించాడు. 

చలి ఎక్కువగా ఉండటంతో దుప్పటి, జాకెట్ కూడా ఇచ్చాడు. రోజూలాగే జనవరి 16న కూడా జూలియన్ స్టోర్ వద్దకు వచ్చాడు. అయితే, అప్పటికే స్టోర్ మూసేసి ఉంచడంతో జూలియన్ ను వెళ్లిపొమ్మని వివేక్ సూచించాడు. కానీ, జూలియన్ వెళ్లకపోవడంతో పోలీసులకు ఫోన్ చేస్తానని వివేక్ చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న జూలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన దగ్గర ఉన్న సుత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా తలపై కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి వివేక్ మరణించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.