4 నెలల గరిష్టానికి సెన్సెక్స్​.. 295 పాయింట్లు అప్​ ..114 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

4 నెలల గరిష్టానికి సెన్సెక్స్​.. 295 పాయింట్లు అప్​ ..114 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై:  విదేశీ నిధుల రాకకుతోడు ముడి చమురు ధరలు తగ్గడంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం దాదాపు 295 పాయింట్లు పెరిగి నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ 30-షేర్ల బీఎస్ఈ బేరోమీటర్ 294.85 పాయింట్లు పెరిగి 80,796.84 వద్ద స్థిరపడింది. 2025లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇంట్రాడేలో 547.04 పాయింట్లు పెరిగి 81,049.03కి చేరుకుంది. ఎన్​ఎస్ఈ నిఫ్టీ 114.45 పాయింట్లు పెరిగి 24,461.15కి చేరుకుంది. ఇది ఈ ఏడాదిలో అత్యధిక ముగింపు స్థాయి. 

సెన్సెక్స్ కంపెనీల్లో అదానీ పోర్ట్స్ 6.29 శాతం పెరిగి టాప్​గేనర్​గా నిలిచింది. బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఎటర్నల్, పవర్ గ్రిడ్, ఐటీసీ, టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్,  హిందూస్తాన్ యూనిలీవర్ కూడా  లాభాలలో ఉన్నాయి. నాలుగో క్వార్టర్​ రిజల్ట్స్​ మెప్పించకపోవడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్​ 4.57 శాతం పడిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్,  ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి. ఎఫ్​ఐఐలు శుక్రవారం రూ.2,769.81 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.4,223 కోట్లు ఇన్వెస్ట్​ చేశారు. 

మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు,  జనవరిలో రూ. 78,027 కోట్లు వెనక్కి తీసుకున్నారు. బీఎస్ఈ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.45 శాతం,  స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.23 శాతం పెరిగింది. సెక్టోరల్ ఇండెక్స్​లలో బ్యాంకెక్స్ మాత్రమే నష్టపోయింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా,  హాంకాంగ్ మార్కెట్లు సెలవుల కారణంగా పనిచేయలేదు. యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు పెరిగాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర 1.45 శాతం తగ్గి 60.40 డాలర్లకు చేరుకుంది. 

అదానీ గ్రూప్ స్టాక్స్ దూకుడు 

లంచం కేసులో క్రిమినల్ అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ గౌతమ్ అదానీ ప్రతినిధులు అమెరికా అధికారులతో సమావేశమయ్యారనే వార్తల కారణంగా సోమవారం అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని స్టాక్స్​ బాగా పెరిగాయి. అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ 11.01 శాతం, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ 6.96 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 6.61 శాతం, అదానీ పోర్ట్స్ 6.29 శాతం, అదానీ పవర్ 5.96 శాతం పెరిగాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీటీవీ షేర్లు 4.74 శాతం, అదానీ ఎనర్జీ 3.30 శాతం, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ 1.99 శాతం, అంబుజా సిమెంట్స్ 1.76 శాతం, ఏసీసీ1.04 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 0.72 శాతం పెరిగాయి. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.13.33 లక్షల కోట్లు పెరిగింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, అదానీ టోటల్ గ్యాస్ 14.12 శాతం, అదానీ పవర్ 11.31 శాతం పెరిగింది.