పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి

పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి

జమ్ము : జమ్మూకాశ్మీర్‌‌లో పాకిస్తాన్‌‌ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది. బుధవారం అర్ధరాత్రి కూడా పాకిస్తాన్ రేంజర్లు మన దేశానికి చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లపై అకారణంగా కాల్పులు జరిపారు. సాంబా జిల్లా రామ్‌‌గఢ్ సెక్టార్‌‌ అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) ఏరియాలో జరిగిన ఈ ఘటనలో ఓ బీఎస్‌‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

గాయపడిన జవానుజమ్మూలోని జీఎంసీ ఆస్పత్రిలో  ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందాడని తెలిపారు. చనిపోయిన జవాను 50 ఏండ్ల లాల్ ఫామ్ కిమా అని..అతను మిజోరంలోని ఐజ్వాల్ నివాసి అని వివరించారు. సాంబా సరిహద్దు పోస్టు లోని జవాన్లే లక్ష్యంగా పాకిస్తాన్ రేంజర్లు మళ్లీ మళ్లీ కాల్పులు జరుపుతున్నట్లు చెప్పారు.