పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను కూల్చివేసిన BSF

పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను కూల్చివేసిన BSF

పాకిస్తాన్  చెందిన నిఘా డ్రోన్‌ను  బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ (BSF) ద‌ళాలు కూల్చివేశాయి. భారత సరిహద్దు జిల్లా కథువా హీరానగర్ సెక్టార్ దగ్గర ఇవాళ(శనివారం, జూన్-20) ఉదయం పాక్ కు చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. రహస్యంగా అది ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన BSF 19 బెటాలియన్ జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి కూల్చివేశారు. సరిహద్దులో రహస్యంగా ఫొటోలు తీసేందుకు పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం ఉద‌యం 5.10 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. భార‌త్ వైపున ఉన్న అంత‌ర్జాతీయ బోర్డ‌ర్‌కు 250 మీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.