BSNL కొత్త రీచార్జ్ ప్లాన్..రూ.199 లకే రోజూ 2GB డేటా..30రోజుల వ్యాలిడిటీ

BSNL కొత్త రీచార్జ్ ప్లాన్..రూ.199 లకే రోజూ 2GB డేటా..30రోజుల వ్యాలిడిటీ

ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తున్న BSNL.. మరో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.200 లోపు ధరలోనే రోజుకు 2GB డేటా కలిగిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను BSNL అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర: రూ.199 కాగా.. వ్యాలిడిటీ 30రోజులు, రోజుకు 2GB  అంటే మొత్తం 60GB డేటాను అందిస్తుంది. ఇక కాల్స్ విషయానికి వస్తే అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీ రోమింగ్  అందిస్తుంది.రోజుకు 100 ఫ్రీSMS లు కూడా పొందవచ్చు. 

దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో BSNL 199 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే చౌకైన ధర. అన్ లిమిటెడ్ కాల్స్, ఉచిత SMS లతో  అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. రోజుకు 2GB చొప్పున డేటాతో పని, చదువు, ఎంటర్ టైన్ మెంట్ కోసం సరిపడా నెట్ అందుతంది. 

ఈ ప్లాన్ ను  BSNLఅధికారిక వెబ్ సైట్ లేదా మీ సమీప రీచార్జ్ సెంటర్లకు వెళ్లి  సులభంగా రీచార్జ్ చేయొచ్చు.