అంబేద్కర్​ పేరుతో కేసీఆర్​ నాటకాలు ఆడుతుండు : మాయావతి

అంబేద్కర్​ పేరుతో కేసీఆర్​ నాటకాలు ఆడుతుండు : మాయావతి
  • అంబేద్కర్​ పేరుతో కేసీఆర్​ నాటకాలు
  • ఈ సర్కార్​ను గద్దె దించుదాం.. బడుగు బలహీనవర్గాలను అధికారంలోకి తెద్దాం
  • ‘తెలంగాణ భరోసా’ సభలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి
  • రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్​ను ఎవరూ నమ్మరు
  • ఓట్ల కోసం అంబేద్కర్​ పేరు మీద రాజకీయాలు చేస్తున్నడు
  • మేం యూపీలో దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినం
  • మా స్కీమ్​ను కేసీఆర్​ కాపీ కొట్టి.. 
  • దాన్ని కాగితాలకే పరిమితం చేశారని ఫైర్​
  • అధికారంలోకి వస్తే ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమారే సీఎం అని ప్రకటన
  • బీఎస్పీ దెబ్బకు కేసీఆర్​ బేహోష్​ అయిండు.. 
  • అందుకే అంబేద్కర్​ విగ్రహం పెట్టిండు: ప్రవీణ్​కుమార్​


హైదరాబాద్, వెలుగు:   కేసీఆర్​ తీరుతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు.  ‘‘అంబేద్కర్​ పేరుతో కేసీఆర్​ నాటకాలు ఆడుతున్నడు. యూపీలో దళితులకు మూడెకరాల భూమి ఇచ్చింది మా ప్రభుత్వం. ఆ పథకాన్నే కేసీఆర్​ కాపీ కొట్టిండు.. కానీ, దాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేసిండు. ఒక్కరికి కూడా భూమి ఇవ్వలేదు” అని ఆమె మండిపడ్డారు. కేసీఆర్​ సర్కార్​ను గద్దె దించాల్సిందేనని, బడుగు బలహీనవర్గాలు అధికారంలోకి రావాలని అన్నారు. 

ఆదివారం హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ భరోసా’ సభలో మాయావతి మాట్లాడారు. రాష్ట్రంలో బీఎస్పీ బలపడుతుండడంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్ల కోసం అంబేద్కర్​ పేరుతో కేసీఆర్​ రాజకీయాలు మొద లుపెట్టారని అన్నారు.  ‘‘అంబేద్కర్​ రాసిన రాజ్యాంగా న్ని మారుస్తానని ఒకటికి రెండుసార్లు చెప్పిన వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓట్ల కోసమే అంబేద్కర్​ పేరిట నాటకాలు ఆడుతున్నడు. కేసీఆర్​ను నమ్మే పరిస్థితి లేదు’’ అని ఆమె తెలిపారు. తెలంగాణకు చెందిన ఓ ఐఏఎస్​ అధికారిని చంపిన వ్యక్తిని.. బీహార్​ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసినా కేసీఆర్​ స్పందించకుండా సైలెంట్​ అయ్యార న్నారు. తెలంగాణ ఏర్పాటుకు మొదట మద్దతి చ్చింది బీఎస్పీయేనని పేర్కొన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రవీణ్​ కుమారే సీఎం అవుతారని వెల్లడించారు. ముందే చెప్తున్నా అంటూ కార్యకర్తల సమక్షంలో ఆయన పేరును మాయావతి ప్రకటించారు. తెలంగాణలోనూ యూపీ తరహాలో బడుగుబలహీన వర్గాల వారిని కలుపుకొనిపోతామన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.  

అంబేద్కర్​ లక్ష్యాలు నెరవేరలే

ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం రాజ్యాంగంలో బీఆర్​ అంబేద్కర్​ రిజర్వేషన్లు కల్పించారని మాయావతి అన్నారు. అయినా కూడా నేటికీ ఆయా వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తే ఆర్థికంగా మెరుగవుతారని నాడు నెహ్రూ ప్రభుత్వానికి అంబేద్కర్​ సూచించారని, వారిలాగానే ఇతర వెను కబడిన వర్గాలకూ రిజర్వేషన్లు కల్పించేలా కమిషన్​ను ఏర్పాటు చేయాలంటూ 340 ఆర్టికల్​ను పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ, అంబేద్కర్​ మాటలను  నెహ్రూ పట్టించుకోలేదన్నారు. అంబేద్కర్​ లక్ష్యాలను కాన్షీరాం అమలు చేశారని, ఆయన బాటలో నడిచా రని చెప్పారు. అందులో భాగంగానే బీఎస్పీని ఏర్పా టు చేశారని, ఆయన మరణానంతరం తాను పార్టీని ముందుకు తీసుకెళ్తున్నానని మాయావతి తెలిపారు.  

నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తున్నది​

ఎన్నికల టైమ్​లో నిరుద్యోగులను మోసం చేయడం కామన్​ అయిందని, ఎన్నికలొచ్చినప్పుడల్లా కాం గ్రెస్​ పార్టీ నిరుద్యోగం మాటెత్తుకుంటున్నదని మా యావతి ఫైర్​ అయ్యారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఆ పార్టీ ఎన్నో చెప్పిందని, అది కరెక్ట్​ కాదని అన్నారు.  కేవలం నాలుగైదు వేలతోనే కుటుంబం నడుస్తదా? అని ప్రశ్నించారు. కానీ, తాను అధికారంలో ఉన్నప్పుడు యూపీలో భృతికాదు.. ఉద్యోగాల కల్పననే చేశానని మాయావతి చెప్పారు. తాము కార్యకర్తల అండతోనే, వారిచ్చే విరాళాలతోనే రాజకీయం చేస్తున్నామని తెలిపారు.