బాల్క సుమన్ ను చెన్నూరు నుంచి వెళ్లగొడతాం: బీఎస్పి మహిళ జోనల్ కన్వీనర్ మద్దెల భవాని

బాల్క సుమన్ ను చెన్నూరు నుంచి వెళ్లగొడతాం: బీఎస్పి మహిళ జోనల్ కన్వీనర్ మద్దెల భవాని

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తనపై దాడికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బీఎస్పి మహిళ జోనల్ కన్వీనర్ మద్దెల భవాని ఆరోపించారు... తనపై దాడి జరుగుతుందనే సమాచారంతో జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చానని తనకు ఎమ్మెల్యే బాల్క సుమన్ నుండి ప్రాణహాని ఉందన్నారు... సుమన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. మహిళలపై దాడి జరిపిస్తాననడానికి ఎమ్మెల్యే బాల్క సుమన్ కు సిగ్గుండాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  బాల్క సుమన్ ను చెన్నూరు నియోజకవర్గం వెళ్లగొడతామన్నారు.