
న్యూఢిల్లీ: లోక్‌సభలో తనపై వివాదాస్పద కామెంట్లు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఎంపీ డానిశ్ అలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లెటర్ రాశారు. బిధూరీ ప్రవర్తనను ఖండిస్తూ ప్రధాని బహిరంగ ప్రకటన చేయాలని డానిశ్ అలీ కోరారు.
ఆయన కామెంట్ల వల్ల తనకు కొన్నిరోజులుగా బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రాణహాని ఉన్నందున మెరుగైన భద్రత కల్పించాలని మోదీకి రాసిన లేఖలో డానిశ్ అలీ విజ్ఞప్తి చేశారు. బిధూరీ చేసిన కామెంట్లను కొంతమంది బీజేపీ సభ్యులు ఖండించినప్పటికీ..ఇంకొందరు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.