బంగారు తెలంగాణ కాదు..బాధల తెలంగాణ!

బంగారు తెలంగాణ కాదు..బాధల తెలంగాణ!

తుంగతుర్తి, వెలుగు : పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణలా మారుస్తానని చెప్పి బాధల తెలంగాణగా మార్చారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ కో ఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్, జాజిరెడ్డిగూడెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా కాకుండా, రాజ్యాధికారంలో భాగం కావాలన్నారు. ఏఊరులో చూసినా బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయన్నారు. అన్ని కష్టాలు పోవాలంటే బలహీనవర్గాలు బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, నియోజకవర్గ ఇన్​చార్జి బల్గూరి స్నేహ, చెడపంగి రవికుమార్, కొండగడుపుల ఎల్లయ్య, దాసరి శ్రీనివాస్​, మచ్చ నర్సయ్య, లక్ష్మణ్​  పాల్గొన్నారు.