దేశాలు దాటిన ‘పుష్ప’ క్రేజ్

దేశాలు దాటిన ‘పుష్ప’ క్రేజ్

టాలీవుడ్‎లో హిట్టైన పాటలకు వీడియోలు చేయడం కామన్. అయితే ఈ పాటలు మహా అయితే రాష్ట్రాలు దాటుతాయి. కానీ.. తెలుగులో ఈ మధ్య సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ పాట ఏకంగా దేశాలు దాటింది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా హిరోహిరోయిన్లుగా నటించిన ‘పుష్ప’సినిమా టాలీవుడ్‎లో మంచి హిట్ సాధించింది. ఆ సినిమాలో సమంతా ఓ ఐటం సాంగ్ కూడా చేసింది. ఊ అంటావా.. మావ.. ఊఊ అంటావా.. సాంగ్ ఎంత హిట్టైందో చెప్పక్కర్లేదు. ఆ పాటతో సామ్ తనలో ఓ కొత్త కోణాన్ని కూడా చూపించి.. తనేంటో నిరూపించుకుంది.

అయితే సామ్ నటించిన ఈ పాటకు ఇప్పటికే చాలా స్పూఫ్ వీడియోలు వచ్చాయి. ఎన్నో పాటలకు స్పూఫ్ వీడియోలు చేసే బీటీఎస్ టీం తాజాగా సామ్ పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. వీడియో పోస్ట్ చేసిన ఒక రోజులోనే 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను క్వాలిటీ పోస్ట్‎స్ అనే ఇన్‎స్టా పేజీలో షేర్ చేశారు. అంతేకాకుండా బీటీఎస్‎లోని ‘టీ’ అంటే టాలీవుడ్ అని మెన్షన్ చేయడం గమనార్హం. ఈ విధంగా తెలుగు పాటలు కూడా దేశాలు దాటి.. అందరినీ ఆకట్టుకోవడం ఒకవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా కూడా చెప్పొచ్చు.

For More News..

ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడి