బడ్జెట్ 2020 హైలైట్స్

బడ్జెట్ 2020 హైలైట్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏఏ  రంగాలకు  ఎంత కేటాయించారో తెలుసుకుందాం.

భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్‌’.

విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం.

నేషనల్‌ పోలీస్‌ వర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు.

2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు.

రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్త 5 స్మార్ట్ సిటీస్

నూతన పరిశ్రమల వ్యవస్థాపకత మనకున్న బలం.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం.

నైపుణ్య శిక్షణకు 3వేల కోట్లు.

యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు.

నేషనల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌క 1,480 కోట్లు.

జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం.

చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో బీమా పథకం.

ప్రతి జిల్లాను ఒక ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా రూపొందించాలనేది ప్రధాని ఆలోచన.

అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు.

ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీకి పెట్టుబడులు అవసరం.

సెల్‌ఫోన్లు, సెమీ కండక్టర్లు, వైద్య పరికరాల ఉత్పత్తి ప్రోత్సాహానికి ఒక నూతన పథకం.

ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మారుస్తాం.

జాతీయ మౌలిక సదుపాయాల్లో భాగంగా 103 లక్షల కోట్లు.

భారత్‌ ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.

కేంద్ర రుణభారం 48.7శాతానికి తగ్గింది.

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేస్తాం.

6 లక్షలకు పైగా రైతులు ఫసల్‌ బీమా యోజనతో లబ్ది పొందుతున్నారు.

వ్యవసాయరంగం అభివృద్ధికి 16సూత్రాల పథకం అమలు చేస్తాం.

మొదటి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి.

రెండో ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు.

మూడో ప్రాధాన్యాశంగా విద్య, చిన్నారుల సంక్షేమం.

పప్పుధాన్యాలసాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం.

కృషి సించాయీ యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం.

గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

నీటి కొరత తీవ్రంగా ఉంది.

100 జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

రైతులకు సోలార్‌ పంప్‌సెట్ల పథకాన్ని  మరో 20 లక్షల మంది కి విస్తరిస్తున్నాం.

సాగులేని భూముల్లో సోలార్‌ కేంద్రాలతో రైతులకు ఆదాయం వస్తుంది.

వేల సంవత్సరాల క్రితమే తమిళ మహాకవి అవ్వయ్యార్‌ నీటి సంరక్షణ, భూమి వినియోగం గురించి వెల్లడించారు.

ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌జీలకు సాయం.

కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్‌ యోజన.

వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు, వర్షాభావ జిల్లాలకు సాగునీటి సౌకర్యం.

రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి.

భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు.

రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం. గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా సాయం.

పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం.

మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు.

కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు, ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు.

మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు.

సాగర్‌ మిత్ర పథకంలో గ్రామీణ యువ రైతులకు మత్స్య పెంపకంలో ప్రోత్సాహం.

పేదరికం నిర్మూలనకు స్వయం సహాయక సంఘాల చేయూత.

మత్స్య సంపద ఎగుమతుల లక్ష్యం 200 లక్షల టన్నులు.

ఆరోగ్య రంగానికి 69 వేల కోట్లు కేటాయింపు.

విద్యారంగానికి 99, 300 కోట్లు కేటాయింపు.

వ్యవసాయరంగానికి 2.83 లక్షల కోట్లు కేటాయింపు.

జల్‌ జీవన్‌ మిషన్‌కు 3.06లక్షల కోట్లు.

స్వచ్ఛ భారత్‌కు 12,300 కోట్లు.

జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం.

జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు.