Rashmika: ది గర్ల్‌ఫ్రెండ్'పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. రంగంలోకి విజయ్ దేవరకొండ!

Rashmika: ది గర్ల్‌ఫ్రెండ్'పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. రంగంలోకి విజయ్ దేవరకొండ!

 నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ( The GirlFriend ). ఈ మూవీ ఈరోజు ( నవంబర్ 7న)  ప్రపంచవ్యాప్తంగా విడుదలై సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ సమర్పణలో ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తోంది. రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

రష్మిక ఎమోషనల్ పోస్ట్..

‘ది గర్ల్‌ఫ్రెండ్’  మూవీకి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో.. రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక భావోద్వేగ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా మహిళలు తమను తాము ప్రేమించుకోవడం , ఆత్మవిశ్వాసం గురించి సందేశాన్ని ఇచ్చారు నేషనల్ క్రష్. తమకు నచ్చిన మహిళగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ ఇది ఒక ప్రేమలేఖ అంటూ ఈ బ్యూటీ పోస్ట్ చేసింది. 'నీకేం తెలుసు?' అని అమ్మాయిలను సమాజంలో చిన్న చూపు చూసిన స్థాయి నుంచి.. మహిళగా 'తనకేం కావాలో' ఎంచుకుంటూ ఎదిగిన స్థాయికి చేసిన ప్రయాణం గురించి రష్మిక ప్రస్తావించారు.  ఈ జర్నీపై అమ్మాయిలు గర్వంగా ఫీల్ అవ్వాలని సూచించారు. 

స్వేచ్ఛగా, ధైర్యంగా ముందుకు సాగుతూ..

లైఫ్ లో ముందుకు సాగడానికి సపోర్ట్ గా నిలిచే ప్రియమైన వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ..  పురుషాహంకారం చూపించకుండా, అండగా నిలిచిన పురుషులను ప్రశంసించారు.  వారి ప్రేమే మహిళలకు తన గళాన్ని, ఆలోచనలను బయటపెట్టే ధైర్యాన్ని ఇచ్చిందన్న రష్మిక ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటూ.. స్వేచ్ఛగా, ధైర్యంగా ముందుకు సాగాలనుకుంటున్న ప్రతి మహిళకు ఈ చిత్రం స్పూర్తిదాయకంగా నిలుస్తోందని రష్మిక అన్నారు. చెప్పారు.  ఈ ప్రయాణంలో తన హృదయాన్ని, బలహీనతలను చూపించానని, ప్రేక్షకులు తమ బలాన్ని తిరిగి గుర్తుచేసుకోవాలని ఆకాంక్షించారు

విజయ్ దేవరకొండ ప్రశంస..

రష్మిక నటనను, చిత్ర బృందం కృషిని ప్రశంసిస్తూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సైతం ట్వీట్ చేశారు. ఈ చిత్రం రష్మిక కెరీర్ లో గొప్ప హిట్ గా నిలుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  ఈ చిత్రాన్ని చాలా పవర్ ఫుల్ గా రూపొందించారు.  నటీనటులందరి ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. రాహుల్ రవీంద్రన్, రష్మిక, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి సృష్టించిన ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.  చిత్ర బృందాన్ని అభినందించారు.

 అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్!

‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఒక సగటు అమ్మాయి భూమా జీవితంలోని సున్నితమైన భావోద్వేగాలు, ప్రేమ, కుటుంబ సంబంధాలను అద్దం పడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి, భూమా పాత్రకి రష్మిక ప్రాణం పోసిందని, భిన్న భావోద్వేగాలను అద్భుతంగా పలికించిందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా రష్మిక కెరీర్‌లో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రం నేటి తరం సంబంధాలు, సెల్ఫ్ డెసిషన్ వంటి అంశాలను చర్చిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతారని అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనలన్నీ చూస్తుంటే, 'ది గర్ల్‌ఫ్రెండ్' కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన సందేశంతో కూడిన భావోద్వేగ ప్రయాణం అని స్పష్టమవుతోంది.