వామ్మో.. ఇదేం కొట్టుడు రా సామీ..! గోల్డ్ చోరీకి యత్నించిన మహిళను 20 సెకన్లలో 17 చెంపదెబ్బలు కొట్టిండు

వామ్మో.. ఇదేం కొట్టుడు రా సామీ..! గోల్డ్ చోరీకి యత్నించిన మహిళను 20 సెకన్లలో 17 చెంపదెబ్బలు కొట్టిండు

వామ్మో.. ఇదేం కొట్టుడు రా సామీ..! కింద ఉన్న వీడియో చూస్తే ఇలాగే అనిపిస్తుంది మరీ. నగల షాపులో చోరీకి వచ్చిన ఓ మహిళ కస్టమర్ లాగే నటించింది. యాజమానితో మాట మాట కలుపుతూ ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న కారం పొడిని ఓనర్ కంట్లో చల్లబోయింది. వెంటనే తేరుకున్న షాష్ ఓనర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. చోరీకి యత్నించిన మహిళను పొట్టు పొట్టు కొట్టాడు. 20 సెకన్లలో 17 చెంప దెబ్బలు కొట్టి తన కసి తీర్చుకున్నాడు. ఈ తతంగం అంతా షాప్‎లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‎గా మారింది. 

వివరాల ప్రకారం..  గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌‎లోని రాణిప్‌ ప్రాంతంలో సోని అనే వ్యక్తి నగల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం (నవంబర్ 6) షాప్‏లో సోని ఒక్కడే ఉండటం గమనించిన ఓ మహిళ చోరీకి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా తనతో కారం పొడి తీసుకుని కస్టమర్‎లా షాపులోకి వెళ్లి కూర్చుంది. షాప్ ఓనర్‎తో మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కారం పొడిని సోని కళ్లలోకి కొట్టేందుకు ప్రయత్నించింది మహిళ.

వెంటనే అప్రమత్తమైన షాప్ యాజమాని దాడి నుంచి తప్పించుకున్నాడు. మహిళ చేసిన పనికి పట్టలేని కోపంతో రగిలిపోయిన సోని.. మహిళను పట్టుకుని చితకబాదాడు. కేవలం 20 సెకన్లలోనే 17 చెంప దెబ్బలు కొట్టి తన కసి తీర్చుకున్నాడు. అనంతరం మహిళను కొట్టుకుంటూ  షాప్ బయటకు లాక్కెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌‎గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.. వామ్మో.. అదేం కొట్టుడు రా సామీ అని కొందరు.. చోరీకి యత్నించిన మహిళకు తగిన గుణపాఠం చెప్పావని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై సోని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.