జ్యోతిష్యం: తులారాశిలో సూర్యుడు..శుక్రుడు.. ఐదు రాశుల వారికి రాజయోగం.. ఎప్పటివరకంటే..!

జ్యోతిష్యం:  తులారాశిలో సూర్యుడు..శుక్రుడు.. ఐదు రాశుల వారికి రాజయోగం.. ఎప్పటివరకంటే..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు , శుక్రుడు రెండు గ్రహాలు నవంబర్​ 16 వరకు తులారాశిలో కలసి ఉంటాయి.  ఈ గ్రహాలు కలవడం వలన  రాజయోగం.. ధనయోగం ఏర్పడుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం... ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .

శుక్రుడు సొంతరాశి తులారాశి.ఈ రాశిలో  ఆయన సంచరిస్తుండగా  .. సూర్యుడు కూడా నవంబర్​ 16 వరకు ఉంటాడు.  దీని వలన  ఐదు రాశుల (మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ) వారికి  రాశుల వారికి ఆర్థిక వృద్ధి, ఆస్తి లాభాలు, కుటుంబ సంతోషాలు కలుగుతాయి. 

మేషరాశి: తులారాశి  సప్తమ స్థానంలో సూర్యుడు, శుక్రుడు  కలవడం వల్ల ఆస్తిపాస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.  ఉద్యోగులకు  వేతనం పెరుగుతుంది.  ప్రమోషన్​ రావడం.. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి . వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించడం వంటివి జరుగుతాయి. పెళ్లికోసం ఎదురు చూసే వారు  గుడ్​ న్యూస్​ వింటారు.  నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి. 

ALSO READ : పెళ్లి బాజాలకు సమయం ఆసన్నమైంది.. 

కర్కాటకం:  చతుర్థ స్థానంలో శుక్రుడు , సూర్యుడు కలవడం వలన ఈ రాశి వారికి  ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.   సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. . నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.  . స్థిరాస్తిక్రయ విక్రయాల వల్ల లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూల సమయమని పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు.  ఇదే రాశిలో శుక్రుడు.. సూర్యుడు కలవడం వలన .. ఈరాశి వారికి   జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు బాగా విస్తరిస్తాయి. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. 

ధనుస్సు రాశి: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు, సూర్యుడు  కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది.కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు  చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అంతా మంచే జరుగుతుంది. 

కుంభరాశి: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు .. సూర్యుడు  సంచారం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్నిమించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.  ఉద్యోగం మారేందుకు అనుకూల వాతావరణం కలుగుతుంది.  ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్యమైన శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.