జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నక్షత్రాలు.. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాన్ని మార్చకుంటాయి. ఈ నెలలో శుక్రుడి కదలికలో చాలా మార్పులు ఉంటాయి. నవంబర్ 2న తులారాశిలోకి ప్రవేశించిన శుక్రుడు ... నవంబర్ 7న శుక్రుడు రాహువు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు .మళ్లీ 18న విశాఖ నక్షత్రంలోకి.. ఆ తరువాత 29న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
నవంబర్ 7న రాత్రి 09.13 గంటలకు శుక్రుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు నక్షత్రమైన స్వాతిలోకి శుక్రుడు ప్రవేశించిన తరువాత మేషరాశి..మిథున రాశి...తులా రాశి...వృశ్చిక రాశి..మకర రాశి వారికి శుభఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మేషరాశి : శుక్రుని నక్షత్ర మార్పు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. రాహు నక్షత్రంలోకి ప్రవేశించడం ద్వారా కొత్త మార్గాలను సృష్టిస్తాడు. దీనివల్ల భౌతిక సుఖాలు పెరుగుతాయి.వారు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఆలోచించరు. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ విజయాన్ని అందుకుంటారు. కుటుంబమంతా సంతోషంగా ఉండాలని, అందర్నీ కలపడం కోసం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకోకుండా రాజీమార్గంలో పరిష్కారమై, బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. గృహ యోగం పడుతుంది.
మిథున రాశి: శుక్రుడు .. స్వాతి నక్షత్రంలోసంచారం సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగస్తులకు పురోగతికి అవకాశాలు ఏర్పడుతాయి. ఈ సమయంలో మీరు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు.ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరిస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని, కలిసి ఉండాలని భావిస్తారు.ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.
తులా రాశి : శుక్రుడు.. స్వాతి నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గుతాయి. అన్ని పనుల్లోనూ అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.
►ALSO READ | జ్యోతిష్యం: తులారాశిలో సూర్యుడు..శుక్రుడు.. ఐదు రాశుల వారికి రాజయోగం.. ఎప్పటివరకంటే..!
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి రాహువు నక్షత్రంలో సంచరించే సమయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ కాలంలో జీవితంలో సానుకూల పరిస్థితులు పెరిగి, కొత్త ఆలోచనలు మనసులో ఉద్భవిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇది, ఆర్థిక స్థితి బలపడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్‌లో పెద్ద టార్గెట్ సాధన లేదా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.
మకర రాశి: శుక్రుడు .. స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారి గోచారం అద్భుతమైన ఫలితాలు తీసుకువస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు వేచి చూస్తున్నాయి. సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా, ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న వివాదాలు, తప్పుగా అర్థం చేసుకోవడాలూ, అపార్థాలూ తీరిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, శుక్రుడు.. ధనం, విలాసం, సంబంధాల గ్రహం కాబట్టి, ఈ గోచారం జీవితంలో సమతుల్యతను తీసుకువస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్కులు ఈ మార్పును చర్చిస్తున్నారు. శుక్రుడు నక్షత్రం మార్పు.. రాహువు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం వలన 12 రాశుల వారికీ సరికొత్త పాఠాలు నేర్పుతుంది. కానీ మేష..మిథున ...తులా...వృశ్చిక .మకర రాశుల వారికి విజయ ద్వారాలు తెరుస్తుంది. శుక్ర పరివర్తన వల్ల మిగతా రాశులపై కూడా వివిధ ప్రభావాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా ఈ రాశులకు ఇది బంగారు అవకాశాలు ఇస్తుంది. నవంబర్ నెలలో ప్రతి శుక్రవారం రోజు పూజలు చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
