డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రూ. 12 వేల కోట్లు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రూ. 12 వేల కోట్లు

అసెంబ్లీలో 2022, 2023 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ్ పెట్టారు హరీశ రావు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రూ. 12 వేల కోట్లు కేటాయించారు. ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల సాయం చేస్తామన్న ప్రభుత్వం.. ఆ సాయాన్ని రూ. 3లక్షలకు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కోసం ఒక్కొక్కరికి  రూ. 3 లక్షలు ఇవ్వబోతుందన్నారు. నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3. 57 లక్షల ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయన్నారు. మిగతా 43 వేల ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు పలు ప్రమాద బాధితులకు కేటాయించేందుకు వీలుగా సీఎం పరిధిలో ఉంటాయన్నారు.