జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు వ్యాపారానికి.. తెలివితేటలకు.. మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తి మొదలగు విషయాలను నిర్దేశిస్తాడు. పండితులు తెలిపిన వివరాలు.. బుధ మహర్దశలో ఉన్నవారు చేస్తున్న బిజినెస్ లో అధికంగా లాభాలు ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన బుధుడు సంచారం ఎంతో ముఖ్యమైనది. డిసెంబర్ 6 వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధ సంచారంలో మార్పు.. ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది... ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది మొత్తం అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. . బుధుడు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు.2025 డిసెంబర్ నెలలో బుధుడు ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఐదు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. ఈ నెల 6 వతేది వృశ్చికరాశిలోకి ప్రవేశించిన బుధుడు.. డిసెంబర్ 28 వరకు ఇదే రాశిలో కొనసాగనున్నాడు.
మేషరాశి:వృశ్చికరాశిలో బుధుడి సంచారం ఈ రాశి మిశ్రమ ఫలితాలుంటాయి. మొదట్లో కొంత ఆందోళన కలిగినా చివరకు మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: బుధుడు. వృశ్చికరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు .కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. కెరీర్ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. . వ్యాపారం చేసే వారికి అధికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. . ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అంతా మంచే జరుగుతుంది.
మిథున రాశి: బుధుడు .. వృశ్చిక రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ రాశి వారికి పనిభారం..ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఎవరితోను వాదన పెట్టుకోకుండా.. వారి పని వారు చేసుకోండి. ఆరోగ్య విషయంలో అనుకోని ఇబ్బందులు రావడంతో డబ్బు ఖర్చవుతుంది. ఊహించని నష్టాలు వచ్చే ప్రమాదం ఉన్నందున మీ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి:వృశ్చిక రాశిలో బుధ సంచారం వలన ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడుతాయి. మీలో మీ రే కూర్చుని పరిష్కరించుకోండి. వేరే వారికి అవకాశం ఇవ్వవద్దు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇదిమంచి సమయం. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్థిక పరంగా కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సింహ రాశి: ఈ రాశి వారికి బుధ సంచారంలో మార్పు చాలా కలసి వస్తుంది. వృశ్చికరాశిలోకి బుధుడు ప్రవేశించిన తరువాత ( 2025 డిసెంబర్ 6 నుంచి) చేపట్టిన ప్రతి పనిలో కూడా అభివృద్ది ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొత్త పెట్టుబడులు బాగా కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రేమికులు చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.మే ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి.. వృశ్చికరాశిలో బుధ సంచారం ఈ రాశి వారికి ఏమంత మంచిదికాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. రావలసిన సొమ్ము చేతికి అందక ఇబ్బంది పడతారు.అప్పులు చేయాల్సి వస్తుంది.ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది.. ఉద్యోగస్తులకు పనిభారం.. అవమానాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కొత్తపెడుబడులను వాయిదా వేయండి. వృథా ప్రయాణాలు ...అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
తులా రాశి: ఈ రాశి వారికి బుధ సంచారంలో మార్పు రావడంతో ... ఈ రాశి వారికి కెరీర్ లో మంచి మార్పులు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం బాగా కలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగాఉంటుంది. అధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి. జాబ్ మారాలనుకొనే వారికి మంచి సమయం. వృత్తి పనుల వారికి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి. ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది.
వృశ్చికరాశి: బుధుడు ఇదే రాశిలో 2025 డిసెంబర్ 6 వ తేది ప్రవేశించడంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అధికంగా డబ్బు ఖర్చవుతంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. సరైన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో మోసపోవడం లేదా నష్టపోసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పడతాయి. సహాయం పొందిన బంధుమిత్రులు ముఖం చాటేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనస్సురాశి: బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశం అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారికి సంతోషం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు కొత్తగాపెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.
మకర రాశి: ఈ రాశి వారికి బుధ సంచారంలో మార్పు బాగా కలసి వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో.. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాలు బాగా కలసి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా అభివృద్ది ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఫలితం పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తారు. నిరుద్యోగులు గుడ్న్యూస్ వింటారు. అయితే శతృవుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కుంభరాశి : ఈ రాశివారికి .. బుధుడు.. వృశ్చిక రాశిలో సంచారము వలన అనేక లాభాలను అందుకోబోతున్నారు. . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. సానుకూల మార్పులు ఉంటాయి. . అవివాహితులకు పెళ్లి అయ్యే సూచనలున్నాయి. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీనరాశి: వృశ్చిక రాశిలో బుధుడు సంచారం వలన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. పెండిగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగాఉంటుంది. జాబ్ మారాలనుకొనే వారికి మంచి సమయం. వృత్తి పనుల వారికి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి. ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
