అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన అధికార వైసీపీ ప్రకటించింది. ఇక్కడి నుంచి  డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లుగా వెల్లడించింది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ..  అనకాపల్లి ఎంపీ సీటును మాత్రం పెండింగ్ లో పెట్టింది.  బూడి ముత్యాల నాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత.  ప్రస్తుతం ఈయన  మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.  

మాడుగుల నుంచి ఈ సారి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు.  ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా వైసీపీ నేత సత్యవతి కొనసాగుతున్నారు. అయితే మరోసారి ఆమెను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించేందుకు వైసీపీ అధిష్టానం ఆసక్తి చూపించలేదు.

Also Read:రాజధాని రైతులకు షాక్ - ఆగిపోయిన అమరావతి ఉద్యమం

 మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటుకు ఎన్డీయే కూటమి తరుఫున సీఎం రమేష్ పోటీ చేస్తు్న్నారు. బీజేపీ తరుఫున సీఎం రమేష్ బరిలో నిలవనున్నారు.  కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో  మాడుగుల నుంచి పోటీ చేసిన ముత్యాలనాయుడు 16 వేల 392 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2022లో జగన్ కేబినెట్ లో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.