
సింహం అడవికి రాజు. దాన్ని ఏ జంతువైనా చూసిందా.. ఇక అంతే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి సింహాన్ని ఓ గేదె కొమ్ములతో ఎగరేసి.. ఎగరేసి తన్నే వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది.
ఎవరికైనా ఆపద పొంచి ఉంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. . . మనుషులైనా జంతువులైనా అంతే. బలమైన జంతువు దాడికి పొంచి ఉన్నప్పుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఓ సింహంపై ..గేదె తలబడి.. సింహానికి పట్టపగలే చూపించింది.
సింహంపై గేదె దాడి
@Figensport అనే ట్విట్టర్ ఖాతాలో ఇటీవల షేర్ చేసిన ఈ వీడియోలో, ఒకే స్థలంలో రెండు మూడు గేదెలు కనిపించాయి. గేదెపై దాడి చేసి తినడానికి ప్రయత్నిస్తున్న సింహం కూడా ఉంది. ఆ గేదెలను తినడానికి సిహం దగ్గరగావచ్చింది. ఇంతలో మరో గేదె వచ్చి సిహంపై కొమ్ములతో దాడి చేసింది. దీంతో ఫారెస్ట్ కింగ్ .. కోతిలా గాలిలోకి ఎగిరేసి తన్నడం ప్రారంభించింది. గేదె సింహాన్ని పలు మార్లు కొమ్ములతో కిందపడుకుండా తన్నడంతో సింహం ఏమీ చేయలేకపోయింది.
వీడియో వైరల్
ఈ వీడియోకు 18 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి, అయితే చాలా మంది వ్యక్తులు తమ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా అందించారు. ఆమె చాలా శక్తివంతమైన నీటి గేదె అని ఒకరు చెప్పారు. మనుషుల్లాగే జంతువులకు కూడా నిర్భయంగా ఉన్నారని, అక్కడికక్కడే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఒకరు చెప్పారు. మీ చుట్టూ నమ్మకమైన వ్యక్తులు ఉంటే, వారు మిమ్మల్ని కష్ట సమయాల్లో రక్షిస్తారని ఈ వీడియో చూడటం గుణపాఠం చెబుతుందని ఒకరు అన్నారు.
https://twitter.com/Figensport/status/1664611571396661248