ఐదో అంతస్తు నుంచి పడి..భవన కార్మికుడు మృతి

ఐదో అంతస్తు నుంచి పడి..భవన కార్మికుడు మృతి

ముషీరాబాద్‌‌‌‌, వెలుగు: నిర్మాణంలోని బిల్డింగ్​పైనుంచి పడి ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు. ముషీరాబాద్​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ డివిజన్ నర్మద హాస్పిటల్​సమీపంలో నిర్మాణంలోని భవనానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుడు కృష్ణారావు(47) ఆదివారం పరదాలు కడుతున్నాడు.

 ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా పని చేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.