వారంలో పెళ్లి.. బిల్డింగ్ పెచ్చులూడి పడి యువతి మృతి

V6 Velugu Posted on Jul 07, 2021

హైదరాబాద్‌లో ఓ భవనం పెచ్చులూడి పడి 25 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. కూకట్‌పల్లిలోని ఓ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన బిల్డింగ్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మూడో అంతస్తు నుంచి పెచ్చులూడి కింద నడిచి వెళ్తున్న ఆ మహిళ తలపై పడటంతో ఆమె మరణించింది. ఈ ఘటనలో మరణించిన ఆ యువతికి మరో వారంలో పెండ్లి జరగాల్సి ఉంది. ఆ బిల్డింగ్‌ ఫస్ట్ ఫ్లోర్‌‌లో ఉన్న బొటెక్‌లో తన పెండ్లి దుస్తులు తీసుకునేందుకు వచ్చిన ఆమె, నడిచి వెళ్తుండగా పెచ్చులూడి తలపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి భవనం మూడో అంతస్తులో గోడలకు క్రాక్స్ వచ్చి ఉన్నాయని, ఈ విషయం ఓనర్‌‌కు చెప్పి రిపేర్లు చేయించాలని కోరినా పట్టించుకోలేదని అందులో అద్దెకు ఉంటున్నవారు చెబుతున్నారు. అయితే ఈ బిల్డింగ్ ఒక ఎమ్మెల్యే కుటుంబానికి చెందినది కావడంతో విషయం పెద్దది కాకుండా చేసేందుకు పోలీసులు, ఓ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Tagged Hyderabad, Died, woman, MLA, marriage, Kukatpally, Building

Latest Videos

Subscribe Now

More News