బలుపు దింపారు : ముఖంపై మూత్రం పోసినోడి ఇంటిని కూల్చేశారు

బలుపు దింపారు : ముఖంపై మూత్రం పోసినోడి ఇంటిని కూల్చేశారు

మధ్యప్రదేశ్ లో రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసి యవకుడిపై  ఓ వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దూమారాన్ని రేపింది. మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో మూడు నెలల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు.   నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  సీఎం  ఆదేశాల మేరకు నిందితుడిని ఆరెస్ట్ చేసిన పోలీసులు... అతనిపై సెక్షన్ 294, 504 కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడి ఇంటిపై  బుల్డోజర్ చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంతో స్థానిక యంత్రాగం చర్యలు చేపట్టింది. 

https://twitter.com/AHindinews/status/1676534603199434752

మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలోని నిందింతుడిని ఇంటిని బుల్డోజర్ తో కూల్చేశారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   నిందితుడిన అరెస్టు చేసిన అనంతరం సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులతా పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, త్వరలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.