శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద పోలీసులు తూటా గుర్తించారు. విశాల్ అనే ప్రయాణికుడు బుధవారం ఇండిగో(6ఈ-6709) ఫ్లైట్‌లో కలకత్తా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చాడు. తిరిగి బెంగుళూరు వెళ్లేందుకు మరో ఇండిగో(6ఈ-887) ఫ్లైట్‌కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టికెట్ బుక్ చేసుకుని బోర్డింగ్ వద్దకు వెళ్లాడు. సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు విశాల్ లగేజీ బ్యాగ్ ను తనిఖీ చేయగా 0.38 లైవ్ బుల్లెట్ దొరికింది. దానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని తూటాను స్వాధీనం చేసుకున్నారు. విశాల్‌ను ఎయిర్‌పోర్టు పోలీసులు విచారిస్తున్నారు.
