
ఒకకప్పు కాఫీ తాగితే టెన్షన్ పోతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. అదే ఒక కప్పు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగితే హై లెవెల్ లో ఎనర్జీ అందుతుంది. అంతేకాదు క్షణాల్లో బాడీలోకి శక్తి వస్తుంది. అందుకే ఈ మధ్య ఈ కాఫీ ట్రెండ్ అయింది. సరిగా తిండి తినకుండా ఉరుకులు పరుగులు పెట్టేవాళ్లకు, రెగ్యులర్ గా గేమ్స్ ఆడేవాళ్లకు ఈ కాఫీ క్రేజ్ గా మారింది.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎప్పటినుంచో ఉన్నా ఈ మధ్యే బాగా పాపులర్ అయింది. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఎక్కువగా ఈ కాఫీ తాగుతుంటారు. శక్తికావాలన్నా.. హుషారుగా ఉండాలన్నా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఉపవాసాలు.. డైట్ కంట్రోల్ లో ఉండేవాళ్లు ఒక కప్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగితే వెంటనే ఎనర్జీ అందుతుంది. దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు కూడా.
తయారీ విధానం: బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తయారీకి సంబంధించినవన్నీ సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. ఇవి కొని తెచ్చుకుంటే జస్ట్ 5 నిమి షాల్లో ఈ కాఫీని తయారుచేసుకుని తాగొచ్చు. మొదట సర్టిఫైడ్ క్లీన్ బీన్స్ తో కాఫీ రెడీ చేసు కోవాలి. ఇలా తయారు చేసిన కాఫీలో రెండు స్పూన్ల బ్రెయిన్ ఆక్టేన్ సి8 ఎమ్ సిటి ఆయిల్, రెండు స్పూన్ల గ్రాస్ ఫెడ్ బటర్ వేయాలి. చివరగా నురుగు వచ్చేవరకు 20 సెకన్లపాటు బ్లెండర్ లో ఉంచాలి.
బెనిఫిట్స్: ఒక కప్పు బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ తాగితే నీరసం తగ్గుతుంది. ఈ కాఫీలో హై లెవెల్ లో క్యాల రీలు ఉంటాయి. ఫ్యాట్ 25 గ్రాములుంటే శాచురేటెడ్ ఫ్యాట్ 21 గ్రాములవరకు ఉంటుంది. కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫైబర్, షుగర్, సాల్ట్ వంటివి మాత్రం ఈ కాఫీలో ఉండవు. దానివల్లే డైటింగ్ చేసేవాళ్లు ఈ కాఫీని రెగ్యులర్ గా తాగుతుంటారు.
ఎవరు తాగొచ్చు: డైట్ కంట్రోల్ చేసేవాళ్లే కాదు ఈ కాఫీని ఎవరైనా తాగొచ్చు. గేమ్స్ ఎక్కువగా ఆడేవా ళ్లు, అప్పటికప్పుడు ఎనర్జీ కావాలనుకునేవాళ్లు కూడా ఈ కాఫీని తాగొచ్చు. కాని బాగా వీక్ గా ఉన్నవాళ్లు మాత్రం ఈ కాఫీ తాగకుండా ఉంటేనే బెటర్. ఈ కాఫీని కొత్తగా ట్రై చేసే వాళ్లు కూడా కచ్చితంగా హెల్దీగా ఉండాలి. అప్పుడే దీన్ని తాగాలి. ఎందుకంటే ఈ కాఫీలో కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, షుగర్, సాల్ట్ వంటివి ఉండవు. అప్పటికే వీక్ గా ఉన్నవాళ్లు ఈ కాఫీ తాగడం వల్ల మరింత వీక్ అయ్యే చాన్స్ ఉంది.
వెలుగు, లైఫ్