
ముంబై నుండి అహ్మదాబాద్ కి ఉన్న దూరం 500కిలోమీటర్లు, సాధారణంగా ఇంత డిస్టెన్స్ జర్నీ చేయాలంటే ఎంత సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ లో వెళ్లినా కూడా మినిమమ్ 6,7గంటల సమయం పడుతుంది. కానీ, 3గంటల్లోనే చేరుకునే రోజు త్వరలోనే రానుంది. 2017లో జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ప్రారంభించిన ముంబై - అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గుజరాత్ పోర్షన్ దాదాపు పూర్తయ్యింది. ముంబైలో అత్యంత కీలకమైన టన్నెల్ పనులను ఇటీవలే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు.
ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన ఈ టన్నెల్ 21కిలోమీటర్ల మేర ఉంటుందని, అందులో 7కిలోమీటర్ల మేర 56 అడుగుల డెప్త్ తో అండర్ వాటర్ టన్నెల్ ఉంటుందని తెలుస్తోంది. 40అడుగుల వైశాల్యంతో ఉండే ఈ టన్నెల్ లో ట్రైన్ 320కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2026 జులై, ఆగస్టు నాటికంత పూర్తవవుతుందని మంత్రి తెలిపారు.
320కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ 12స్టాప్స్ లో ఆగుతుందని, సగటున 170 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ మధ్య ఉన్న 500కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3గంటల్లోనే కవర్ చేయగలదని తెలుస్తోంది. 508కిలోమీటర్లు ఉన్న ఈ లైన్ గుజరాత్ లో 351 కిలోమీటర్లు, ముంబైలో 157 కిలోమీటర్లు ఉంటుంది. సూరత్,బిలిమోర మధ్య మొదటి బులెట్ ట్రైన్ నడుస్తుందని ఇది పూర్తయితే ప్రపంచంలోని 15సంపన్న దేశాల సరసన భారత్ నిలుస్తుందని మంత్రి అశ్విన్ అన్నారు.