హగ్స్, హైఫైలు లేకపోయినా ఫర్వాలేదు

హగ్స్, హైఫైలు లేకపోయినా ఫర్వాలేదు

సలైవా బదులు వేరే ఏదైనా కావాలి!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా

న్యూఢిల్లీ: వికెట్‌‌తీస్తే హగ్స్‌‌ఇచ్చుకోవడం.. హై ఫైలు చెప్పుకోవడం.. ఒకరి మీద ఒకరు పడిపోవడం.. క్రికెట్‌‌లో కామన్‌‌గా కన్పించే సీన్స్‌‌ఇవి. అయితే కరోనా వైరస్‌‌నేపథ్యంలో వీటన్నింటికి ఫుల్‌‌స్టాప్‌‌పెట్టినా ఫర్వాలేదన్న టీమిండియా స్టార్‌‌పేసర్‌‌జస్‌‌ప్రీత్‌‌బుమ్రా.. బాల్‌‌ను షైన్‌‌చేసేందుకు సలైవా (ఉమ్మి)కు వేరే ఏదైనా చూపాలని అంటున్నాడు. సలైవాను బ్యాన్‌‌చేయడం వల్ల బౌలర్లకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు.  ఐసీసీ నిర్వహించిన ఓ వీడియో సిరీస్‌‌లో మాజీ క్రికెటర్లు ఇయాన్‌‌బిషప్‌‌, షాన్‌‌పొలాక్‌‌తో సలైవాపై బుమ్రా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌కోసం వికెట్‌‌తీసిన తర్వాత హగ్స్‌‌, హైఫైస్ ‌‌వద్దన్నారు. పర్సనల్‌‌గా నేను వీటికి దూరంగానే ఉంటా. అందువల్ల ఈ ఆంక్షల వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ సలైవా బ్యాన్‌‌ విషయంలోనే అభ్యంతరాలున్నాయి. ఆట మళ్లీ రీస్టార్ట్ ‌‌అయ్యే టైమ్‌‌కి గైడ్‌‌లైన్స్‌‌ఎలా ఉంటాయో తెలీదు. కానీ బాల్ ‌‌షైనింగ్‌‌కు ప్రత్యామ్నాయం మాత్రం చూపించాలి. బాల్‌‌ను జాగ్రత్తగా మెయింటేన్ ‌‌చేయకపోతే  బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. షైన్ ‌‌చేయకపోతే స్లాగ్‌‌ఓవర్స్‌‌లో రివర్స్‌‌సింగ్ ‌‌కాకపోయినా కనీసం మామూలు స్వింగ్‌‌ను కూడా రాబట్టలేం. అప్పుడు మ్యాచ్‌‌లన్నీ బ్యాట్స్‌‌మన్‌‌ ఫేవర్‌‌గా జరుగుతాయి’ అని బుమ్రా అన్నాడు.

బౌలర్లకు అనుకూలంగా మారాయి..

ఇటీవల పరిస్థితులు.. పేసర్లకు అనుకూలంగా ఉన్నాయన్న ఇయాన్‌‌బిషప్‌‌వ్యాఖ్యలను బుమ్రా అంగీకరించాడు.  టెస్ట్‌‌క్రికెట్‌‌వరకు  ఇది నిజమేనన్నాడు. ‘అవును.. టెస్ట్‌‌లు కొంతవరకు పేసర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకే లాంగ్‌‌ఫార్మాట్‌‌అంటే నాకు ఇష్టం. పేసర్లు ఏదైనా చెయ్యడానికి టెస్ట్‌‌ల్లోనే చాన్స్‌‌దొరుకుతుంది. వన్డేల విషయానికొస్తే రెండు కొత్త బాల్స్‌‌ఉంటాయి. అతికష్టం మీద చివర్లో రివర్స్‌‌స్వింగ్‌‌రాబట్టగలం. బాల్‌‌స్వింగింగ్‌‌గురించి బ్యాట్స్‌‌మన్‌‌ఫిర్యాదులు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే బాల్‌‌అంటేనే స్వింగ్‌‌అవుతుంది. పైగా మా (బౌలర్లు) పని త్రోడౌన్స్‌‌వేయడం కాదు కదా’ అని బుమ్రా పేర్కొన్నాడు.

ఇబ్రమోవిచ్‌‌తో పోలికలున్నాయి..

కెరీర్‌‌విషయంలో స్వీడన్‌‌ఫుట్‌‌బాల్‌‌స్టార్‌‌జటాన్‌‌ఇబ్రమోవిచ్‌‌కు తనకు కొన్ని పోలికలు ఉన్నాయి బుమ్రా చెప్పాడు. ‘వ్యక్తిగతంగా ఇబ్రమోవిచ్‌‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. కెరీర్‌‌పరంగా మాకు కొన్ని పోలికలున్నాయి. ఇబ్రమోవిచ్‌‌కు స్టార్‌‌అయ్యే సత్తా ఉందని ఎవ్వరు నమ్మలేదు. నేను కూడా అలాంటి పరిస్థితులను ఫేస్‌‌చేశా.  నా బౌలింగ్‌‌యాక్షన్‌‌వల్ల ఎక్కువ కాలం ఆడలేనని విమర్శించారు. ఎప్పుటికీ టాప్‌‌బౌలర్‌‌కాలేనన్నారు. కానీ నేనెప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇబ్రమోవిచ్‌‌కథలోనూ ఈ విషయాన్ని చూశా. అందుకే అతనితో పోల్చుకున్నా’ అని ఈ స్టార్‌‌పేసర్‌‌వ్యాఖ్యానించాడు.

బాడీని రెడీగా ఉంచుతున్నా…

ఇండియా మళ్లీ ఎప్పుడు క్రికెట్‌మ్యాచ్‌ఆడుతుందో  తనకు తెలియదన్న బుమ్రా… ఎప్పుడు పిలుపు వచ్చినా రెడీగా ఉండాలనే ఉద్దేశంతో శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నానని చెప్పాడు. ‘మూడు నెలలకు పైగా బౌలింగ్‌చేయకపోతే బాడీ ఎలా రియాక్ట్‌అవుతుందో నాకు తెలియదు. అందువల్ల స్టేడియాలు రీ ఓపెన్‌అయ్యేటప్పటికీ శరీరం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ట్రెయినింగ్‌కొనసాగిస్తున్నా. వారంలో ఆరు రోజులు ప్రాక్టీస్‌చేస్తున్నా. కానీ బౌలింగ్‌వేయడం లేదు. ఇంత పెద్ద బ్రేక్‌తర్వాత ఫస్ట్‌బాల్‌వేసినప్పుడు బాడీ ఎలా రియాక్ట్‌అవుతుందో చెప్పలేను’ అని బుమ్రా అన్నాడు.

For More News..

చిరు వ్యాపారులకు వైరస్‌ ఎఫెక్ట్‌

చెత్తబుట్టలో బీసీ లోన్‌‌ దరఖాస్తులు

జనం కోసమే తెలంగాణ

ఉద్యమ లక్ష్యాలకు దూరంగా..